బీజేపీ గుప్పిట్లో డీఎంకే, అన్నాడీఎంకే.. తమిళనాడులో బీహార్ సీన్ రిపీట్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-08 08:46:49  IST  )

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీ రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్నాయని, విజయ్ విజయాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు.

బీజేపీ గుప్పిట్లో డీఎంకే, అన్నాడీఎంకే.. తమిళనాడులో బీహార్ సీన్ రిపీట్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో (TamilNadu Politics) ట్విస్టుల మీద ట్విస్టులు నమోదు అవుతున్నాయి. పొత్తులు, ఎత్తులతో అరవం పాలిటిక్స్ లో ఎవరు కింగ్ కాబోతున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది. విజయ్ టీవీకే పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు తెలుపగా మద్దతు తెలిపేందుకు ఇంకా కలిసి వచ్చే పార్టీల కోసం విజయ్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీవీకేకు మద్దతు విషయంలో అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే, డీఎంకేపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులో గవర్నర్‍తో పాటు అన్నాడీఎంకే, డీఎంకేను బీజేపీ తమ గుప్పిట్లో పెట్టుకుందని ఆరోపించారు.

బిహార్ సీన్ రిపీట్!:

వెన్నుపోటుదారులు అంటూ నిన్న డీఎంకే నేతలు మాట్లాడుతున్నారు.. వెన్నుపోటుదారులెవరు? ద్రోహం చేసిందెవరు అని మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. బీజేపీ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉందని అందుకే డీఎంకే, అన్నాడీఎంకే కలిశాయన్నారు. ఇది తమిళనాడు ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలను తమిళనాడు ప్రజలు తిరస్కరించారని బిహార్‍లో నితీశ్ కుమార్ విషయంలో జరిగిందే తమిళనాడులో రిపీట్ అవుతోందన్నారు. తమిళనాడును నియంత్రించాలని బీజేపీ భావిస్తోందని అన్నాడీఎంకే ఇప్పటికే లొంగిపోయిందని ఇప్పుడు డీఎంకే వంతు వచ్చిందన్నారు. విజయ్ సీఎం కాకుండా అమిత్ షా అడ్డుకుంటున్నారని, పళనిస్వామి ఈ కసరత్తు చేస్తున్నారు. ఇందులో డీఎంకే కలిసిందని ఆరోపించారు.

గవర్నర్ తీరుపై కోర్టుకు విజయ్

తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్: విజయం తథ్యమని విజయ్ ఆసక్తికర ట్వీట్


Next Story