ఆమె ఒక్క రోజు మేకప్‌కు రూ.30 లక్షలు, చీరకు రూ. కోట్లు.. వామ్మో ఒక ఊరునే పోషించవచ్చోమో..!

by Disha Web Desk 7 |
ఆమె ఒక్క రోజు మేకప్‌కు రూ.30 లక్షలు, చీరకు రూ. కోట్లు.. వామ్మో ఒక ఊరునే పోషించవచ్చోమో..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరుపురానీ అనుభూతి. అందుకే పెళ్లిని అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని చాలా మంది ఆశ పడతారు. కానీ.. కొంత మందికి అంత తాహతు, స్తోమత ఉండదు. వారికి ఉన్నంతలో పెళ్లి చేసుకుని, చుట్టాలకు, ఊళ్లో వాళ్లకు భోజనాలు పెట్టి సంతృప్తి పొందుతారు. ధనవంతులు మాత్రం నలుదిక్కులా మారుమోగి పోయేలా.. అందరూ చర్చించుకునేలా అట్టహాసంగా జరుపుకుంటారు.

ఈ మాదిరిగానే కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన్ రెడ్డి తన కూతురి వివాహం జరిపించారు. అసలు పెళ్లి కూతురు పట్టు చీరకి, ఆమె మేకప్‌కు, నగలకు అయిన ఖర్చుతో ఊరుఊరంతా సంవత్సరాల పాటు సంతోషంగా బతకొచ్చు అంటే నమ్మగలరా..? ఆమె పెళ్లికి పెట్టిన ఖర్చుతో దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లి వేడుకల్లో ఈ వివాహ వేడుక చోటు దక్కించుకుంది. అయితే మరి పెళ్లి కూతురు చీర, నగలు, మేకప్ పూర్తి విషయాలు తెలుసుకుందాం..

కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. 50 వేల మందికి పైగా అతిథులు హాజరైన ఈ ఐదు రోజుల పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ పెళ్లికి అతిథులుగా విచ్చేసిన వారి కోసం 40 విలాసవంతమైన ఎడ్ల బండ్లతో గేటు దాకా స్వాగతం పలికారు. శ్రీకృష్ణదేవరాయ విజయనగరం తరహాలో పెళ్లి మండపాన్ని బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్లు డిజైన్ చేశారు. అంతే కాదు అతిథులను తరలించేందుకు దాదాపు 2000 క్యాబ్‌లు, 15 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. బెంగళూరులోని ఫైవ్, త్రీ స్టార్ హోటళ్లలో 1,500 విలాసవంతమైన గదులను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. వివాహ మండపంలో భద్రత కోసం ఏకంగా 3 వేలమంది పోలీసులను నియమించారు.

ఇదంతా పక్కన పెడితే.. బంగారు దారంతో నేసిన రూ.17 కోట్ల విలువైన కాంచీపురం పట్టుచీర వధువు బ్రాహ్మణి ధరించింది. ముంబై నుంచి వచ్చిన స్పెషల్‌ మేకప్‌ ఆర్టిస్టులతో వధువును ముస్తాబు చేయడానికి రూ.30 లక్షలు ఖర్చు చేశారు మరి. ఇక పెళ్లిలో ఆమె ధరించిన ఆభరణాల విలువ సుమారు రూ.90 కోట్లు. మంత్రి కుమార్తె పెళ్లి జరిగి ఏడేళ్లు అవుతున్న ఇప్పటికీ దేశవ్యాప్తంగా కథలుకథలుగా చర్చించుకుంటున్నారంటే అది ఆషామాషీ పెళ్లి కాదన్న మాట. ఎందుకంటే ఈ పెళ్లికి మంత్రి ఖర్చు పెట్టింది ఏకంగా రూ.500ల కోట్లు. అందుకే ఈ పెళ్లిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేక పోతున్నారు.

Next Story

Most Viewed