‘రాజీనామాకు సిద్ధం’.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మల్లారెడ్డి సవాల్

by Satheesh |
‘రాజీనామాకు సిద్ధం’.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మల్లారెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య మేడ్చల్ జిల్లా కుత్భుల్లాపూర్ పరిధి సుచిత్రలోని భూ వివాదం మరింత ముదురుతోంది. భూమి నాదంటే నాదని ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు మల్లారెడ్డి సవాల్ విసిరారు. సుచిత్రలోని తన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. భూ పత్రాలు సరైనవైతే రాజీనామా చేసేందుకు నువ్వు సిద్ధమా అని లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు. నాది తప్పు అని నిరూపిస్తే అన్నీ వదిలేసి వెళ్లిపోతానని అన్నారు. వాళ్లవే అన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని మల్లారెడ్డి ఆరోపించారు. ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి, సంబంధిత కలెక్టర్లను కలుస్తానని.. తన దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తానని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed