AP Politics: పోలింగ్ శాతం పెరగడంతో గెలుపు పై ఎవరి ధీమా వారిది..!

by Jakkula Mamatha |
AP Politics: పోలింగ్ శాతం పెరగడంతో గెలుపు పై ఎవరి ధీమా వారిది..!
X

దిశ,రాయచోటి: అన్నమయ్య జిల్లా 6 నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు గెలుపు పై ఎవరి ధీమా వారిది అని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వర్గీయులు మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని బట్టి మెజార్టీల అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల వైసీపీ అభ్యర్థి గెలుస్తాడని అంచనాలు వేస్తున్నారు. ప్రజల్లో వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉందని పోలింగ్ సరళి బాగా జరిగిందని టీడీపీ గెలుస్తుందని అవర్గీయాలు చెబుతున్నారు. అవును మేమే గెలుస్తున్నాం అంటూ ఇరు పార్టీలు జోరుగా హుషారుగా ప్రచారాలు సాగుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఆరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు సంబంధించి మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోటీలో ఉన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించగా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పండుటాకులు వరకు ఎవరు గెలుస్తారనే టాక్ పల్లెల నుంచి పట్టణాల వరకు వినిపిస్తున్నాయి.

గెలుపుపై ధీమా వ్యక్తం..

పోలింగ్ శాతం పెరగడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వం విధానాలతో హింస పడ్డారని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దౌర్జన్యాలు మితిమీరాయని ఈ పరిపాలన నుంచి విముక్తి పొందడానికి ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ బారులు తీరారని పార్టీల నేతలు అంటున్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు భారీగా లబ్ధి పొందిన ఓటర్లు బారులు తీరి ఓట్లు వేశారని వైసీపీ నేతల నమ్మకం. వైసీపీకి ఓట్లు వేయడానికి పోటీపడి వేశారని ప్రభుత్వం తిరిగి వైసీపీ నే వస్తుందని ఆ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచి మహిళలు బారులు తీరి ఓట్లు వేశారని ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీకే ఓటు వేశారని అందువల్ల వైసీపీ తిరిగి ప్రభుత్వాన్ని నిలబెడుతుందని ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదే తరుణంలో కూటమి నేతల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం , ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మరిన్ని మహిళలకు అనుకూలంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారనే అందువల్లనే కూటమి పార్టీలకు ఓట్లు పడ్డాయని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.



Next Story

Most Viewed