ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు

by  |
ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నివర్ తుపాన్ కారణంగా ఏపీలోని రైతులు ఇప్పటికే సర్వం కోల్పోయారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు పడి, చేతికొచ్చిన పంట సర్వనాశం అయింది. దాని నుంచి కోలుకోకముందే మరో భారీ వర్షం గండం ఏపీ ప్రజలను వెంటాడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మన్నార్ గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయిగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధనంగా ట్రోపో ఆవరణ ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.



Next Story

Most Viewed