కార్పొరేట్ గద్దలకు సద్ది కట్టే పార్టీ బీజేపీ : కేసీఆర్

by Disha Web Desk 23 |
కార్పొరేట్ గద్దలకు సద్ది కట్టే పార్టీ బీజేపీ : కేసీఆర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన జిల్లాలను పునర్విభజన పేరిట తొలగించాలని చూస్తుందని, కొట్లాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలా లేక పోవాలా అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించి, నేతన్న చౌక్ వద్ద కేసీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వంలో దేవుని పేరు ఉండాలని జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అని పెట్టినట్లు స్పష్టం చేశారు. రాజన్న ఆలయానికి కేంద్రాన్ని ఇక్కడి ఎంపీ ఏం అడగలేదని, మొన్న వచ్చిన ప్రధాని మోడీ ఏం ఇవ్వలేదని మండిపడ్డారు. చేనేత కార్మికులు అంటే బీజేపీకి లెక్క లేదని, చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోడీ అని, బీజేపీ ప్రభుత్వ ఒక్క సంక్షేమ పథకం కూడా రాష్ట్రంలో ఒక్క ఇంటికి రాలేదని విమర్శించారు.

బీజేపీ అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ గ్రద్దలకు లక్షల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అర చేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టీతే ఆడవాళ్ళు తన్నుకుంటున్నారని, ఆటో కార్మికులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అవమానించితే కరీంనగర్ గడ్డ తనకు సద్ది కట్టి భారీ మెజార్టీతో గెలిపించిందని గుర్తు చేశారు. రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్, కల్లాల్లో ధాన్యం కూడా కొనడం లేదని మండిపడ్డారు. పద్మశాలి కార్మికులను అవమానించారని మాట్లాడితే తనపై 48 నిషేధం విధించారని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీ రామారావు తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed