స్వాతి మలివాల్ దాడి కేసు.. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం సీఎం నివాసానికి నిందితుడు

by Shamantha N |
స్వాతి మలివాల్ దాడి కేసు.. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం సీఎం నివాసానికి నిందితుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: సంచలనం సృష్టించిన స్వాతి మలివాల్ దాడి కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేపట్టారు పోలీసులు. దీని కోసం నిందితుడు భిభవ్ కుమార్ ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్లారు. భిభవ్ కుమార్ ను విచారించిన పోలీసులు.. ఈకేసులో దాదాపు 20 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. అందులో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది కూడా ఉన్నారు. అయితే మరికొందరి వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందన్నారు అధికారులు. అవసరమైతే సీఎం కేజ్రీవాల్, ఆయన కుటుంబసభ్యుల స్టేట్ మెంట్స్ తీసుకుంటామన్నారు. సోమవారం సాయంత్రం 5:45 గంటలకు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేపట్టారు పోలీసు. దాదాపు గంటపాటు అక్కడే ఉండి.. భిభవ్ ను అతడి నివాసానికి తీసుకెళ్లారు.

భిభవ్ తన ఫోన్ డేటాను ఫార్మాట్ చేయడానికి ముందు డేటాను మరో సిస్టమ్ లో డంప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. భిభవ్ ను ముంబై తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మే 13న కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ స్వాతిపై కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో భిభవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో శనివారం అర్ధరాత్రి భిభవ్ కుమార్ కు ఐదు రోజుల కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు.

Next Story