- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అసహ్యంగా ఉంది.. నేను ట్రాన్స్‌జెండర్ అంటూ రూమ్ ఇవ్వలేదు.. నటుడు ఎమోషనల్ (వీడియో)
దిశ, సినిమా: మరాఠీ నటుడు ప్రణిత్ హట్టే ‘కర్భారీ లేభరి’ అనే సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. అబ్బాయిగా ఉండే ఇతడు లింగ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్ట్‌లు పెడుతూ నెట్టింట సందడి చేస్తుంది ఈ నటి. ఈ క్రమంలోనే తాను లింగ మార్పిడి చేసుకున్న కారణంగా తాజాగా తనకు ఎదురైన పరిస్థితి గురించి ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.
నటి మాట్లాడుతూ.. ‘నేను ఓ హోటల్లో గదిని ముందుగానే బుక్ చేసుకున్నాను. నాకు ఓకే అయింది. కానీ బసను ముందుగానే బుక్ చేసుకున్నప్పటికీ, ట్రాన్స్ ఉమెన్ అయినందుకు నాకు హోటల్ గది ఇవ్వలేదు. అంతే కాకుండా హోటల్ పూజా ఇంటర్నేషనల్ చివరి నిమిషంలో నా బుకింగ్‌ను రద్దు చేశారు. దీంతో చాలా ఫీల్ అయ్యాను. అంతే కాకుండా నేను బుక్ చేసుకున్న పత్రాన్ని హోటల్ అధికారులతో కూడా పంచుకున్నప్పటికీ, వారు కూడా లింగ ప్రాధాన్యత కారణంగా గదిని ఇవ్వడానికి నిరాకరించారు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రణిత్. ఇందుకు సంబంధించిన వీడియోను ‘అసహ్యం.. జెండర్ కారణంగా రూమ్ రిజెక్ట్ చేశారు’ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ కావడంతో.. కొంత మంది ఆమెకు సపోర్ట్‌గా రిప్లైలు ఇస్తున్నారు.