ఇజ్రాయెల్ ప్రధానిపై అరెస్టు వారెంట్.. యుద్ధానికి బాధ్యులు అని ఆరోపణలు

by Shamantha N |
ఇజ్రాయెల్ ప్రధానిపై అరెస్టు వారెంట్.. యుద్ధానికి బాధ్యులు అని ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏడు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యూహు, హమాస్ నాయకులు అని ఆరోపించారు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సహా హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ కోరుతున్నట్లు ప్రకటించారు.

గాజా, ఇజ్రాయెల్ లో జరిగిన యుద్ధనేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, హమాస్ నాయకులు యెహియా సిన్వార్, మహమ్మద్ దీప్, ఇస్మాయిల్ హానియేలను బాధ్యులుగా పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధానిని, హమాస్ నాయకులు ప్రాసిక్యూట్ చేసేందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రీ ట్రయల్ ప్యానెల్ నుంచి వారెంట్లు కావాలి. సాక్ష్యాధారాలు పరిశీలించేందుకు, విచారణలు ముందుగు సాగవచ్చో లేదో నిర్ణయించేందుకు రెండు నెలల టైం పడుతుంది. మరోవైపు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్ సభ్యదేశం కాదు. అరెస్టు వారెంట్లు జారీ చేసినా.. ఇజ్రాయెల్ నాయకులు వెంటనే ప్యాసిక్యూషన్ ని ఎదుర్కోరు. అయినప్పటికీ, ప్యాసిక్యూటర్ కరీం ఖాన్ ప్రకటన వల్ల ఇజ్రాయెల్ నాయకుల అంతర్జాతీయ ప్రయాణాలను క్లిష్టతరం చేస్తుంది.

ఇకపోతే, అక్టోబరు 7, 2023న హమాస్ జరిపిన సరిహద్దు దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. యుద్ధం వల్ల దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 250 మందిని బందీలుగా మిగిలారు. ఇజ్రాయెల్ దాడి ప్రారంభించినప్పట్నుంచి 35 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు తెలిపారు.





Next Story

Most Viewed