చైనాతో బీజేపీకి సంబంధాలు.. సమావేశాల్లో ఏం జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్

by Shamantha N |
చైనాతో బీజేపీకి సంబంధాలు.. సమావేశాల్లో ఏం జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. 2008 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధికారులతో బీజేపీ 12 సార్లు సమావేశాలు నిర్వహించిందని ఆరోపించింది. ఆ మీటింగ్ లకు సంబంధించిన పూర్తి వివరాల రికార్డును కోరింది కాంగ్రెస్. ఈ సమావేశాల్లో ఏం జరిగిందో.. రెండు పార్టీలు తరచుగా ఎందుకు కలుసుకున్నాయో చెప్పాలన్నారు ఏఐసీసీ మీడియా విభాగం ఛైర్మన్ పవన్ ఖేరా.

2020 జూన్ నుండి చైనాకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు బీజేపీ ఎందుకు ఇష్టపడట్లేదో చెప్పాలని ప్రజలు అడుగుతున్నారని అని అన్నారు. బీజేపీకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్న సన్నిహిత సంబంధాలేనా దానికి కారణం అని అడిగారు. 2008 నుంచి బీజేపీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య కనీసం 12 సమావేశాలు జరిగాయని అన్నారు. ఆ మీటింగ్ లు ఎక్కువశాతం చైనాలోనే జరిగాయని చెప్పారు.

"ఈ సమావేశాల్లో ఏమి జరిగింది? ఈ రెండు పార్టీలు ఎందుకు తరచుగా కలుసుకున్నారు? బీజేపీ క్యాడర్ కమ్యూనిస్ట్ పార్టీ 'స్కూల్'కి వెళ్ళినప్పుడు.. వారికి ఏమి బోధించారు? 2017 జూన్ లో డోక్లామ్ ఘర్షణ జరిగిన టైంలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు సీసీపీతో ఎందుకు సమావేశమయ్యారు? యే రిష్తా క్యా కెహ్లతా హై (ఈ సంబంధాన్ని ఏమంటారు)?" అని పవన్ ఖేరా బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

బీజేపీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య జరిగిన సమావేశాల వివరాలను ఖేరా ప్రస్తావించారు. 2008 అక్టోబర్ లో 15 మంది సభ్యుల చైనా ప్రతినిధి బృందం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు. చైనాతో సంబంధాలు పెంచుకునేందుకు బీజేపీ ఎప్పుడూ మొగ్గు చూపుతుందని.. రాజ్ నాథ్ సింగ్ అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు పవన్ ఖేరా.



Next Story

Most Viewed