- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: పొలిటికల్ పార్టీలకు బిగ్ అలర్ట్.. పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఈసీ కీలక ఆదేశాలు
by Kema Shiva Kumar |
ఏపీలో పోలింగ్ సమీపిస్తున్న వేళ పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పోలింగ్ సమీపిస్తున్న వేళ పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పోలింగ్ రోజునే ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ పూర్తి వివరాలు అందజేస్తే సరిపోతుందని ఈసీ పేర్కొంది. ఈ విషయంలో ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాలని తెలిపింది. అదేవిధంగా ప్రొసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో పోలింగ్ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఈసీ తెలిపింది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఏజెంట్ల నియామకం విషయంలో పోలీసులు అభ్యంతరాలు తెలిపే అధికారం లేదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Next Story






