Samantha: భారీ ఆఫర్ ప్రకటించిన సమంత: ‘నా దగ్గర ఉద్యోగం కావాలంటే మీ వివరాలు ఈ మెయిల్‌కు పంపండి!’

by Disha Web Desk 9 |
Samantha: భారీ ఆఫర్ ప్రకటించిన సమంత: ‘నా దగ్గర ఉద్యోగం కావాలంటే మీ వివరాలు ఈ మెయిల్‌కు పంపండి!’
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సొంత చేసుకుంది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. కానీ మ్యారేజ్ విషయంలోనే కాస్త సోషల్ మీడియాలో నెగిటివ్ మార్క్ సంపాదించుకుంది. కొద్ది రోజుల అనంతరం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. అవన్నీ అధిగమించి సామ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి మొన్న సమంత బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఎర్ర చీర కట్టుకుని.. చేతిలో తుపాకీ పట్టుకుని వీరనారి గెటప్‌లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా పునకాలొచ్చాయి.

ఇదిలా ఉంటే సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా అండ్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్‌గా మారింది. సాకీ పేరుతో సమంత గార్మెంట్ బ్రాండ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ కంపెనీలో పని చేసేందుకు సామ్ ఉద్యోగ ప్రకటన చేసింది. తగు అర్హతలు ఉన్నవారు కింద ఇచ్చిన మెయిల్ అడ్రస్‌కు వివరాలు పంపాలని సామ్ తెలిపింది. కాగా ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కూడా ఉన్నాయని సామ్ వెల్లడించింది. ఇక ఈ వార్త విన్న క్యూటీ సమంత ఫ్యాన్స్ ఎగిరిగంతులెస్తున్నారు. ఇక ఆలస్యమెందుకు ఈ గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకోకుండా మీరు కూడా అప్లై చేసుకోండి.

Read More...

సమంతకు బిగ్ షాకిచ్చిన నాగచైతన్య.. అసలు ఏమైందంటే!



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed