ఓటింగ్‌ డేటా ప్రకటనలో ఎలాంటి లోపాల్లేవ్.. ఖర్గేపై ఫైర్ అయిన ఈసీ

by Dishanational6 |
ఓటింగ్‌ డేటా ప్రకటనలో ఎలాంటి లోపాల్లేవ్.. ఖర్గేపై ఫైర్ అయిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలపై ఈసీ మండిపడింది. ఓటర్లలో గందరగోళం సృష్టించేలా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు ఆటంకం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుని ఈసీ గౌరవిస్తుందని తెలుపుతూనే.. ఖర్గేకు చురకలు అంటించింది. అయితే, ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల నిర్వహణ, ఆదేశాలపై ప్రభావాన్ని చూపే పరిణామాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తుచేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పోలింగ్‌ ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని మండిపడింది. ఎన్నికల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తాయన్నారు. ఖర్గే లేఖ అత్యంత అవమానకరమని వ్యాఖ్యానించింది. ఆయన ఆరోపణలన్నీ అపోహలే అని. ఓటింగ్‌ డేటా సేకరణ, పోలింగ్ శాతం ప్రకటనలో ఎలాంటి లోపాలు జరగలేదని స్పష్టం చేసింది ఈసీ.

జాతీయ పార్టీ నుంచి ఎన్నికల విశ్వనీయతపై ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటనలు కలవరపెడుతున్నాయని పేర్కొంది పోల్ ప్యానెల్. ఖర్గే ఆరోపణలను తోసిపుచ్చిన పోల్ ప్యానెల్ అటువంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించింది. ఈసీ ఈ మేరకు ఘాటుగా ఆయనకు లేఖ రాసింది. ఈవీఎంలపై కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలను ఈసీ హైలెట్ చేసింది.

ఇకపోతే, ఇటీవలే పోలింగ్‌ శాతంపై ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత అత్యల్పంగా ఉందని విమర్శించారు. ‘ఇండియా’ బ్లాక్ నేతలకు ఆయన రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed