- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నువ్వు అంత బాధపడాల్సిన అక్కర్లేదు.. హరీశ్‌రావుకు మంత్రి పొన్నం కౌంటర్
రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడుమ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ రగడ షురువైంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడుమ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ రగడ షురువైంది. సిద్దిపేట (Siddipet) జిల్లాను రద్దు చేస్తానంటే తాము ఊరుకోబోమని.. రేవంత్ రెడ్డికి కోపం ఉంటే తనపై చూపించాలని కాని సిద్దిపేట ప్రజల మీద కాదంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కామెంట్ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటామని అన్నారు.
ఈ నేపథ్యంలోనే హరీశ్ రావుకు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాము సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని ఎక్కడా చెప్పనేలేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని.. కనీసం ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేశారని ఫైర్ అయ్యారు. ఆనాడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అంటూ గరం అయ్యారు. అదేవిధంగా హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలపారని.. అక్కడి ప్రజలకు కరీంనగర్ జిల్లాలో ఉండాలనే బలమైన కాంక్ష ఉందన్నారు. అందుకు అనుగుణంగానే పలు జిల్లాల్లో హద్దులో మారుతాయని స్పష్టం చేశారు. అందుకు హరీశ్ రావు అంత బాధపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పకుండా ప్రజల ఆకాంక్షల మేరకే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ విషయంలో ఆందోళనపడి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయోద్దని మంత్రి పొన్నం తనదైన స్టైల్లో హరీశ్‌రావుకు చురకలంటించారు.






