- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్న నాయకులు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల సీఎంలపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వాటాల పంపిణీ విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరును ఆయన అభినందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తెలుగుజాతి గౌరవం పెంచేలా ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలుగువారి ప్రయోజనాల కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) తపన పడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అనే స్ఫూర్తిని వీరు చాటుతుంటే మాజీ ముఖ్యమంత్రులు ఓర్వలేకపోతున్నారని విమర్శలను గుప్పించారు. విద్వేషాలు రెచ్చకొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే మాజీ సీఎంల కుట్ర పాచికలు పారటం లేదని స్పష్టం చేశారు. విజ్ఞులైన తెలుగు ప్రజలు స్వార్థ రాజకీయాల ట్రాప్ లో పడేంత అమాయకులైతే కాదన్నారు. సెంటిమెంట్ రెచ్చగొట్టి స్వార్థ రాజకీయాల కోసం పాకులాడే వారికి ఇద్దరు సీఎం లు చెక్ పెట్టారని కుండ బద్ధలుకొట్టారు. ఆంధ్రాలో ఉన్నా.. తెలంగాణాలో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. తెలుగు జాతి బాగుండాలన్నదే తమందరి లక్ష్యమని ప్రకటించారు.






