పోచమ్మ ఆలయంలో చోరీ.. నిందితుడు అరెస్ట్

by Jakkula.Mamatha |

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో ఈ నెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

పోచమ్మ ఆలయంలో చోరీ.. నిందితుడు అరెస్ట్
X

దిశ, చైతన్యపురి: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో ఈ నెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బూర్ల అనిల్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీకి గురైన అమ్మవారి పుస్తెలు, వెండి వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి గురై అప్పుల పాలవడంతో డబ్బు కోసం దేవాలయాన్ని లక్ష్యంగా ఎంచుకుని అర్ధరాత్రి సమయంలో దేవాలయం తాళం పగులగొట్టి సీసీటీవీ వైర్లు కత్తిరించి అమ్మవారి బంగారు పుస్తెలు హుండీని అపహరించినట్లు తేలింది. అనంతరం హుండీ పగలగొట్టి అందులోని నగదును తీసుకున్నాడు. సాంకేతిక ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ శాస్త్రీయ ఆధారాలు విశ్వసనీయ సమాచారంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి అపహరించి ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన క్రైమ్ ఎస్సై కె. మహేందర్, సిబ్బందిని సరూర్ నగర్ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ సిహెచ్. శేఖర్, ఎస్‌హెచ్ఓ ఎన్. శ్రీశైలంలు అభినందించారు.

Next Story