- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని అసైన్డ్ భూముల కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: మనోహర్ రెడ్డి
రాజధాని అసైన్డ్ భూముల కేసు రద్దు విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం 11 వేల ఎకరాలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు అమ్మారని ఆరోపించారు.....

దిశ, వెబ్ డెస్క్: 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అసైన్డ్ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandhrababu), మంత్రి నారాయణ(Minster Narayana)పై 2019-24లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం(Cm Jagan Mohan Reddy Government) కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. దీంతో రాజధాని అసైన్డ్ భూముల కేసు రద్దు విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి(YCP State Legal Cell President Manohar Reddy) స్పష్టం చేశారు. మొత్తం 11 వేల ఎకరాలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు అమ్మారని ఆరోపించారు. మంత్రి నారాయణ డబ్బులు ఎలా మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడియో లీక్‌లపై ఫోరెన్సిక్స్ దర్యాప్తు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఫైబర్ నెట్, ఇన్నరింగ్ రోడ్, ఇసుక కేసులు ఏమయ్యాయని నిలదీశారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు ఏపీకి వచ్చారని స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.






