- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ గాయాలు తగ్గకపోవడంతో ఏమి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఓ వివాహిత మహిళ జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది.

దిశ, కౌడిపల్లి: అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ గాయాలు తగ్గకపోవడంతో ఏమి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఓ వివాహిత మహిళ జీవితంపై విరక్తి చెంది శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటి ఆవరణలోని బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంఘటన మండలంలోని కూకుట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్లపల్లి గ్రామానికి చెందిన చింతల అంసమ్మ(64) రెండు నెలల క్రితం గ్రామ శివారులో ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా పొదల చాటు నుండి వచ్చిన అడవి పంది అంసమ్మ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అప్పటి నుంచి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ఒంటిపై గాయాలు తగ్గలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె ఎలాంటి పనులు చేయకుండా ఇంటి వద్ద ఉంటుంది. దీంతో మానసికంగా కృంగిన ఆమె జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. మృతురాలి కుమారుడు చింతల రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అమరేందర్ రెడ్డి తెలిపారు.






