- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్ పేరును 'ఇందూరు'గా మారుస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పేరు మార్పు అంశంపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా (Nizamabad District) పేరు మార్పు అంశంపై ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ అరవిందో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ జిల్లా పేరు నిజామాబాద్ గా పెట్టడం వల్లే దురదృష్టం వచ్చిందని ఆ పేరులోనే నష్టం ఉందని, నిజామాబాద్ అని పేరు పెట్టిన కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డాయి, కచ్చితంగా నిజామాబాద్ పేరును మార్చి ఇందూరు (Induru)గా మార్చాల్సిన అవసరం ఉంది ఎంపీ అరవింద్ చెప్పుకొచ్చారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) బాసటగా నిలిచారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును కచ్చితంగా 'ఇందూరు'గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ వ్యాఖ్యలకు పార్టీ కట్టుబడి ఉందని, ఇది తమ నిబద్ధత అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత పేర్లు నిజాం కాలం నాటి నిరంకుశత్వాన్ని, అరాచకాలను గుర్తుచేసేలా ఉన్నాయని రాంచందర్ రావు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. అందుకే కేవలం నిజామాబాద్ మాత్రమే కాకుండా, నిజాం పాలన ఆనవాళ్లుగా ఉన్న అనేక ఇతర ప్రాంతాల పేర్లను కూడా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనాటి పీడనను గుర్తుచేసే పేర్లను తొలగించడమే తమ ఉద్దేశమని తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధ్యక్షుడు రాంచందర్ రావు చెప్పుకొచ్చారు.
Read More.. నువ్వు అంత బాధపడాల్సిన అక్కర్లేదు.. హరీశ్‌రావుకు మంత్రి పొన్నం కౌంటర్






