తెలంగాణకు వర్షసూచన.. మరో రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో నేడు వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ వ‌ర్షాలు మ‌రికొన్ని జిల్లాల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉంద‌ని, రానున్న 2 గంట‌ల్లో ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు.

తెలంగాణకు వర్షసూచన.. మరో రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో నేడు వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ వ‌ర్షాలు మ‌రికొన్ని జిల్లాల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉంద‌ని, రానున్న 2 గంట‌ల్లో ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఇప్ప‌టికే న‌ల్గొండ‌లో భారీ వ‌ర్షం కురుస్తుండ‌గా మ‌రో రెండు గంట‌ల్లో సూర్యాపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, జ‌న‌గాం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో వ‌ర్షం కురుస్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం సంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి, వికారాబాద్ ల‌లో వ‌ర్షాలు కురుస్తుండ‌గా మ‌రో 2 గంట‌ల్లో సిద్దిపేట‌, రంగారెడ్డి, గ‌ద్వాల్ జిల్లాలకు విస్తరిస్తాయ‌ని పేర్కొన్నారు.

హైద‌రాబాద్ విష‌యానికి వస్తే.. టోలిచౌకి, కార్వాన్, రాజేంద్ర‌న‌గ‌ర్, లంగ‌ర్ హౌస్ ప్రాంతాల్లో ప్ర‌స్తుతం వ‌ర్షం కురుస్తుంద‌ని, మ‌రో గంట‌లో చంద్రాయ‌ణ‌గుట్ట‌, బ‌డంగ్ పేట్, ఆదిభ‌ట్ల‌, బీఎన్ రెడ్డి ప్రాంతాల‌కు విస్త‌రిస్తాయ‌ని అంచ‌నా వేశారు. ఇదిలా ఉంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తుండగా మధ్యాహ్నం సమయంలో ఎండలు మండుతున్నాయి. అయితే మధ్యమధ్యలో మాత్రం చిరుజల్లులు పలకరిస్తున్నాయి.

Next Story