- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య - కొరటాల మూవీకి ఊహించని టైటిల్..!
బాలయ్య - కొరటాల మూవీకి ఊహించని టైటిల్ ఫిక్స్ చేశారట.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తూ.. అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తున్నారు. అందరి హీరోల లాగా కాకుండా, ప్రతి సినిమా మాస్ యాంగిల్ లో తీస్తూ.. రికార్డులు సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యేగా అదే సమయంలో హీరోగా... అటు సామాజికవేత్తగా అన్ని రంగాల్లో అదరగొడుతున్నారు. అలాంటి నందమూరి బాలయ్య త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆయనకు ఈ సినిమా 112వది. అయితే ఈ మూవీకి కార్పెంటర్ అనే ఊహించని టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
నందమూరి బాలయ్య సినిమాలంటే, పవర్ ఫుల్ టైటిల్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకు మాత్రం కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలినలోకి తీసుకోవడం అందరిని ఆసక్తికి గురి చేస్తోంది. అయితే ఈ సినిమాలో కథ డిమాండ్ చేస్తున్న ప్రకారమే కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ మూవీని SLV సినిమాస్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో రాజశేఖర్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.






