ఇథనాల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

by Malleboina Mahesh |   (  Updated:2026-07-20 03:50:15  IST  )

ముంబై కోస్టల్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. అతివేగంతో వెళ్లి ఇథనాల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు అక్కడికక్కడే మృతి!

ఇథనాల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: కోస్టల్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఇథనాల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం ముంబైలోని కోస్టల్ రహదారిపై చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో కారు అత్యధిక వేగంతో ప్రయాణిస్తోంది. కోస్టల్ రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పడంతో డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయాడు. దాంతో అదే మార్గంలో వెళ్తున్న ఇథనాల్ కెమికల్ ట్యాంకర్‌ను కారు బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ట్యాంకర్ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన మరికొందరిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఇథనాల్ ట్యాంకర్ కావడం వల్ల ఎలాంటి అగ్నిప్రమాదం జరగకుండా ముందస్తుగా అగ్నిమాపక సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని, మృతుల వివరాలను సేకరిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొట్టిన ఐషర్ ట్రక్.. ఐదుగురు మృతి!

Next Story