- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొట్టిన ఐషర్ ట్రక్.. ఐదుగురు మృతి!
మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. కారును వెనుక నుండి ఢీకొట్టిన ఐషర్ ట్రక్.. కారులోని నలుగురితో పాటు ట్రక్ డ్రైవర్ సహా 5 గురు మృతి!

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే (Samruddhi Expressway) పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వర్ధా జిల్లా పుల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విరుల్ ఇంటర్‌ఛేంజ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఒక ప్రైవేట్ కారును వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన ఐషర్ (Eicher) ట్రక్ అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారు డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా దెబ్బతిన్న ట్రక్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి ఆ ట్రక్ డ్రైవర్ కూడా మరణించాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రక్ క్లీనర్‌ను హైవే, పుల్గావ్ పోలీసులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుండి తొలగించి, ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించడానికి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మృతి చెందిన ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం పుల్గావ్ రూరల్ ఆసుపత్రికి తరలించి, ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






