క్రేజీ సంస్థల సొంతమైన 'డీసీ' తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు

by Pulgam srinivas |

'డీసీ' చిత్ర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఏసియన్ సురేష్ సంస్థ సొంతం చేసుకుంది.

క్రేజీ సంస్థల సొంతమైన డీసీ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డీసీ'. ఇందులో వామికా గబ్బి కథానాయికగా నటిస్తుండగా, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థకు బలమైన పంపిణీ వ్యవస్థ ఉండటంతో, సినిమాకు విస్తృత స్థాయిలో థియేటర్లు లభించే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Next Story