- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి స్విమ్స్‌లో యూజీ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్
తిరుపతి స్విమ్స్ (SVIMS) లో 2026-27 విద్యా సంవత్సరానికి బి.ఎస్‌సి నర్సింగ్, బి.పి.టి కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 8 చివరి తేదీ.

దిశ, వెబ్ డెస్క్: వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు తిరుపతిలోని ప్రతిష్టాత్మక శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా సంవత్సరం 2026–27కు సంబంధించిన పలు అండర్ గ్రాడ్యుయేట్ (UG) పారామెడికల్, నర్సింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ప్రవేశం కల్పించే ముఖ్యమైన కోర్సులు ఇవే..
బి.ఎస్‌సి. నర్సింగ్ (B.Sc. Nursing) - 4 ఏళ్ల కోర్సు
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (B.P.T.) - 4.5 ఏళ్ల కోర్సు
బ్యాచిలర్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ (B.Sc. AHS / Paramedical)
అర్హత, దరఖాస్తు విధానం..
ఈ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్ (Bi.P.C) పూర్తి చేసి, AP EAPCET–2026 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, వ్యాలిడ్ ర్యాంకు పొందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా ఏపీ ఆన్‌లైన్ (AP Online) కేంద్రాల ద్వారా గానీ లేదా స్విమ్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 08, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని, అభ్యర్థులు ముందే అన్ని సర్టిఫికేట్లతో సిద్ధం చేసుకోవాలని స్విమ్స్ అడ్మిషన్ల విభాగం స్పష్టం చేసింది.






