సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించాలి: మంత్రి పొన్నం

by Kodari Anjali |

సామాజిక హితాన్ని కోరే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించాలి: మంత్రి పొన్నం
X

దిశ, శేరిలింగంపల్లి: సామాజిక హితాన్ని కోరే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ జన్మదిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు బ్యాగుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విహెచ్ హనుమంతరావు, ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, బెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవరావు కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ మాజి చైర్మన్ జెర్రీపాటి జైపాల్ మాజీ కార్పొరేటర్ రఘునాథరెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజ సేవకు క్రమంగా ప్రాధాన్యత తగ్గుతుందని విచారం వ్యక్తం చేశారు. మిరియాల ప్రీతమ్ పుట్టిన రోజు వేడుక లా కాకుండా సమాజ సేవకు ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం అన్నారు.

Next Story