బాలయ్య 'కార్పెంటర్' టైటిల్ వెనుక ఆసక్తికర కారణం

by Pulgam srinivas |

పవర్ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారని అందుకే కార్పెంటర్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

బాలయ్య కార్పెంటర్ టైటిల్ వెనుక ఆసక్తికర కారణం
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితమే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం బాలకృష్ణ 'NBK111' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలోని చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి 'కార్పెంటర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు, దాదాపు ఇదే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ టైటిల్‌ను పరిశీలించడానికి మేకర్స్‌కు ఓ ప్రధాన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండనుందని, వ్యవస్థ సక్రమంగా ఉండాలని, ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తిగా ఆయన కనిపించనున్నట్లు సమాచారం. అదే లక్ష్యానికి ఎవరైనా అడ్డుగా నిలిస్తే వారిని ఎదుర్కొనేందుకు ఏమాత్రం వెనుకాడని పాత్రలో బాలయ్య కనిపించనున్నారట. అందుకే ఈ కథకు 'కార్పెంటర్' అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించిన మేకర్స్, అదే టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సినిమాకు 'కార్పెంటర్' వంటి విభిన్నమైన టైటిల్‌ను పరిశీలిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

Next Story