- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్సింగ్‌గా నమోదైన వ్యక్తి.. బావిలో మృతదేహంగా లభ్యం
by Taduka Kalyani |
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం గాజుల్పాడ్ గ్రామానికి చెందిన మక్తే రమేష్ (45) వ్యవసాయ పొలం నుంచి వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సోలార్ ప్లేట్‌ను దొంగలించారని, దానిని వెతికేందుకు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

X
దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం గాజుల్పాడ్ గ్రామానికి చెందిన మక్తే రమేష్ (45) వ్యవసాయ పొలం నుంచి వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సోలార్ ప్లేట్‌ను దొంగలించారని, దానిని వెతికేందుకు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శనివారం ఆయన భార్య కుషాల్ భాయి కంగ్టి పోలీస్ స్టేషన్‌లో భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం గాజుల్పాడ్ గ్రామ శివారులోని మక్దూం సబ్ వ్యవసాయ భూమిలో ఉన్న నీటి బావిలో రమేష్ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






