- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRAI: ట్రూకాలర్ ట్యాగ్‌లపై ట్రాయ్ ఆగ్రహం
ఒక కాల్ మోసపూరితమా కాదా అన్నది కేవలం కస్టమర్ల బ్లాకింగ్ అలవాట్ల ఆధారంగా నిర్ణయించడం సరైన విధానం కాదని నియంత్రణ సంస్థ అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రత్యేక నంబర్ సిరీస్‌లకు ట్రూకాలర్ చూపిస్తున్న ‘ఫ్రీక్వెంట్లీ బ్లాక్‌డ్’ ట్యాగ్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. 1600 సిరీస్ నుంచి వచ్చే కాల్స్‌ను ఇలా లేబుల్ చేయడం వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని, ఎందుకంటే ఈ నంబర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, ప్రభుత్వ సేవల నుంచి వచ్చే ముఖ్యమైన సర్వీస్, లావాదేవీ కాల్స్ కోసం కేటాయించినట్టు ట్రాయ్ తెలిపింది. ఒక కాల్ మోసపూరితమా కాదా అన్నది కేవలం కస్టమర్ల బ్లాకింగ్ అలవాట్ల ఆధారంగా నిర్ణయించడం సరైన విధానం కాదని నియంత్రణ సంస్థ అభిప్రాయపడింది.
మరోవైపు ట్రూకాలర్ మాత్రం తాము ఈ నంబర్లను ‘స్పామ్’గా గుర్తించడం లేదని, వినియోగదారులు ఎక్కువగా బ్లాక్ చేస్తున్న నంబర్లకు మాత్రమే ఈ ట్యాగ్ చూపిస్తున్నామని చెబుతోంది. 140, 1600 సిరీస్‌లకు ట్యాగ్‌లు చూపించడం వల్ల చట్టబద్ధమైన వ్యాపార కమ్యూనికేషన్లపై అనవసర అనుమానాలు పెరుగుతాయని ట్రాయ్ స్పష్టం చేసింది. స్పామ్ సమస్య ప్రధానంగా ఈ ప్రత్యేక సిరీస్‌ల నుంచి కాకుండా సాధారణ మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్ల నుంచే వస్తోందని, 80 శాతానికి పైగా అనవసరమైన మార్కెటింగ్ కాల్స్ ఈ కేటగిరీ నుంచే వస్తున్నాయని తెలిపింది. టెలికాం కంపెనీలు ఏఐ ఆధారిత వ్యవస్థలతో ప్రతిరోజూ కోట్లాది అనుమానాస్పద కాల్స్‌ను గుర్తిస్తున్నాయని ట్రాయ్ పేర్కొంది. వినియోగదారులకు ప్రమోషనల్ కాల్స్‌పై నియంత్రణ కల్పించేందుకు డీఎన్‌డీ (డు నాట్ డిస్టర్బ్) వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉందని, అందువల్ల ప్రత్యేక నంబర్ సిరీస్‌లను ప్రతికూలంగా చూపించే ట్యాగ్‌ల అవసరం లేదని స్పష్టం చేసింది.






