విరుగంబక్కం లో సత్తా చాటుతున్న విజయ్ డ్రైవర్ కుమారుడు!

by Malleboina Mahesh |   (  Updated:2026-05-04 08:59:49  IST  )

విరుగంబాక్కంలో విజయ్ డ్రైవర్ కుమారుడు శభరినాథన్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. డీఎంకే అభ్యర్థిని వెనక్కి నెట్టి 2550 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉండటం విశేషం. 🗳️ షాకింగ్ రిజల్ట్స్!

విరుగంబక్కం లో సత్తా చాటుతున్న విజయ్ డ్రైవర్ కుమారుడు!
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ పార్టీ అయిన టీవీకే (TVK) నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా విజయ్ అధికంగా సామాన్య, మధ్యతరగతి యువకులకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే తన కారు డ్రైవర్ కుమారునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, స్వయంగా విజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా నేటి ఫలితాల్లో 'విరుగంబక్కం' నియోజకవర్గం ('Virugambakkam' constituency) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్ వ్యక్తిగత కారు డ్రైవర్ కుమారుడు శభరినాథన్ (Sabharinathan), టీవీకే (TVK) అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన తన సమీప ప్రత్యర్థిపై 2550 ఓట్ల ఆధిక్యంతో సత్తా చాటుతున్నారు.

ఈ పోరులో అధికార డీఎంకే (DMK) అభ్యర్థి ప్రభాకర రాజా ప్రస్తుతం రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, బలమైన అధికార పార్టీ అభ్యర్థిని వెనక్కి నెట్టి శభరినాథన్ ఆధిక్యంలో ఉండటం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాన్యులకు అవకాశం ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ట్రెండ్ నిరూపిస్తోందని, దీంతో టీవీకే శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

తమిళనాడులో విజయ్ సునామీ.. తెలుగు రాజకీయాల్లో 'ఫ్రెండ్షిప్' పాలిటిక్స్!

సీఎం పీఠంపై తలపతి విజయ్.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో టీవీకే

Next Story