- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పీఠంపై తలపతి విజయ్.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో టీవీకే
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంది. దీంతో ఆయన సీఎం పీఠంపై కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు పాటిటిక్స్‌లో నవ శకం మొదలైంది. ఎప్పుడూ పాత సాంప్రదాయ పార్టీలకే పట్టం కట్టే ఆ రాష్ట్ర ప్రజలకు ఈసారి విజయ్ స్థాపించిన కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK)కు ‘జై’ కొట్టారు. వస్తున్న ట్రెండ్స్ ప్రకారం.. తమిళనాడు తదుపరి సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై సిటీ మినహా తమిళనాడులోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో టీవీకే అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో అనూహ్యంగా వెనుకంజలో ఉండటం డీఎంకే శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఏఐడీఎంకేతో పవర్ షేరింగ్‌కు నో..
ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకే పార్టీ 108 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దీంతో విజయ్ కాంగ్రెస్, పీఎంకే, సీపీఐ పార్టీల మద్దతను కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీలు 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అన్నాడీఎంకే (AIADMK)తో కలిసి అధికారాన్ని పంచుకోవడానికి విజయ్ సుముఖంగా లేరని సమాచారం. సాయంత్రానికల్లా కొత్త రాజకీయ సమీకరణాలపై పూర్తి స్పష్టత రానుంది.






