Breaking News : సంచలన విక్టరీ.. కార్ల్‌సన్‌ను ఓడించిన తెలంగాణ యువ తేజం

by Muthe.Rajitha |

భారత నంబర్ 1 చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి అంతర్జాతీయ చెస్ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Breaking News : సంచలన విక్టరీ.. కార్ల్‌సన్‌ను ఓడించిన తెలంగాణ యువ తేజం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత నంబర్ 1 చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి అంతర్జాతీయ చెస్ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. FIDE వరల్డ్ రాపిడ్ టీమ్ ఛాంపియన్‌షిప్ 2026లో భాగంగా జరిగిన ఒక కీలక మ్యాచ్‌లో, ప్రపంచ చెస్ దిగ్గజం, మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను అర్జున్ ఓడించి సూపర్ సంచలనం సృష్టించాడు. అర్జున్ ఎరిగైసి తన కెరీర్‌లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాడైన మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించడం ఇదే మొదటిసారి అని ధృవీకరించారు. FIDE వరల్డ్ రాపిడ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో నమోదైన ఈ చారిత్రాత్మక విజయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెస్ అభిమానులు, ప్రముఖుల నుండి అర్జున్‌కు భారీగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలోని వరంగల్ కు చెందిన అర్జున్ తన 14వ ఏటనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్ లో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. అర్జున్ ఎరిగైసి సాధించిన ఈ విక్టరీ, భారత చెస్ రంగానికి మరింత ఊపునిచ్చింది. ఈ అద్భుత ప్రదర్శన దేశంలోని యువ చెస్ ఆటగాళ్లకు, యువతకు పెద్ద ఉత్సాహాన్ని, కొండంత ప్రేరణను ఇస్తుందని క్రీడా విశ్లేషకులు కొనియాడుతున్నారు.

Next Story