ఘోర ప్రమాదం.. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులు అంతా సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు.

ఘోర ప్రమాదం.. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులు అంతా సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భువనేశ్వర్ నుండి చెన్నై వైపు వెళ్తున్న 'తులసి ట్రావెల్స్'కు చెందిన ఈ ప్రైవేట్ బస్సు, రేగుపాలెం జంక్షన్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులందరూ వాహనం నుండి సురక్షితంగా కిందకు దిగిపోయారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణం గానే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో

Next Story