Today's Horoscope:ఈ రోజు(19-06-2026) రాశి ఫలాలు

by Jakkula.Mamatha |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతాయి.

Todays Horoscope:ఈ రోజు(19-06-2026) రాశి ఫలాలు
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతాయి. గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులపై అనుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ(జూన్ 19) శుక్రవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు ఇక్కడ చూడవచ్చు.

మేష రాశి

ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

వృషభ రాశి

ఈ రాశి వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది.

మిథున రాశి

ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పై కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కర్కాటక రాశి

ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయండి. మానసిక ప్రశాంతత కోసం దైవదర్శనం లేదా ధ్యానం చేయడం మంచిది. సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

సింహ రాశి

ఈ రోజు మీకు ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకోని ఆర్థిక లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్య రాశి

ఈ రాశి వారికి ఇవాళ బాగుంటుంది. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

తుల రాశి

ఈ రాశికి చెందిన పని ప్రదేశంలో మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. నూతన వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రోజు పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, పట్టుదలతో పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు.

ధనుస్సు రాశి

వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. అనుకోని శుభవార్త వింటారు. రోజంతా సంతోషంగా సాగుతుంది.

మకర రాశి

ఈ రోజు మీకు చాలా సానుకూలమైన మార్పులు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థానచలనం ఉండే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున బడ్జెట్ ప్రకారం నడుచుకోండి.

మీన రాశి

ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాల కంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. అనవసరపు ఆలోచనలతో సమయాన్ని వృథా చేయకండి. వైవాహిక జీవితం బాగుంటుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన లేదా ఇష్ట దైవ ప్రార్థన చేయడం వల్ల ఈ రోజు మరింత శుభప్రదంగా మారుతుంది.

Next Story