సాయికృష్ణ కేసులో కీల‌క ప‌రిణామం.. సీఐ నాగ‌రాజుపై మ‌ర్డ‌ర్ కేసు

by Ajay Maddhiboyina |

విజ‌యవాడ రౌడీ షీట‌ర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజుపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ఈ కేసులో నాగ‌రాజును అధికారులు స‌స్పెండ్ చేయ‌గా తాజాగా ఆయ‌న‌పై ప‌లు సెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేశారు.

సాయికృష్ణ కేసులో కీల‌క ప‌రిణామం.. సీఐ నాగ‌రాజుపై మ‌ర్డ‌ర్ కేసు
X

దిశ‌, వెబ్ డెస్క్: విజ‌యవాడ రౌడీ షీట‌ర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజుపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ఈ కేసులో నాగ‌రాజును అధికారులు స‌స్పెండ్ చేయ‌గా తాజాగా ఆయ‌న‌పై ప‌లు సెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేశారు. బీఎన్ఎస్ సెక్ష‌న్ 101(1), 127(4), 127(6) కింద కేసులు న‌మోదయ్యాయి. సాయికృష్ణ త‌ల్లి విజ‌లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుమేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ ఫిర్యాదును సీపీ రాజ‌శేఖ‌ర్ బాబు స్వ‌యంగా తీసుకున్నారు.

అంతేకాకుండా ఈ కేసు విచార‌ణ అధికారిగా దిశా పీఎస్ ఏసీపీ అధికారి దైవ ప్ర‌సాద్ ను నియ‌మించారు. ఇక లాక‌ప్ డెత్ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ నేప‌థ్యంలో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. సాయి కృష్ణ కుటుంబ స‌భ్యులు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అత‌డిని లాక‌ప్ డెత్ చేసి డెడ్ బాడీ కూడా దొర‌క్కుండా బూడిద చేశార‌ని ఆరోపిస్తున్నారు. దీంతో కేవ‌లం విజయవాడ‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. గురువారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కేసుపై డీజీపీతో సమావేశమై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు.

Next Story