- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన "తహసీల్దార్ ఉన్నట్లా.. లేనట్లా?" కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది.

దిశ, జమ్మికుంట: ‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన "తహసీల్దార్ ఉన్నట్లా.. లేనట్లా?" కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి కార్యాలయ పని తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్ జమ్మికుంట తహసీల్దార్ సందర్శన సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న సేవలు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు సంబంధించిన పలు రికార్డులను తహసీల్దార్ భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తమ ధ్రువపత్రాలు, రెవెన్యూ సంబంధిత సేవల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తక్షణమే సేవలు అందించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సంబంధించిన ఏ దరఖాస్తు లేదా సమస్య కూడా పెండింగ్‌లో ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే లబ్ధిదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ‘దిశ’ దినపత్రికలో వచ్చిన కథనం నేపథ్యంలో జరిగిన ఈ తనిఖీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కార్యాలయ పనితీరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తనిఖీలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గడ్డం శంకర్, జీపీఓ రాజాకిరణ్‌తో పాటు పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






