- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లో నాగదుర్గకు బంపర్ ఆఫర్.. యంగ్ హీరో సరసన హీరోయిన్‌గా చాన్స్!
నాగదుర్గకు టాలీవుడ్‌లో ఒక భారీ బంపర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం.

దిశ, సినిమా: జానపద పాటల్లో అందం, అభినయం తనదైన యాక్టింగ్, డ్యాన్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో గూడుకట్టుకుంది యూట్యూబ్ స్టార్ నాగదుర్గ. సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా ఆమె చేసిన ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచి, మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను రాబట్టాయి. కేవలం తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే అందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపై నటిగా రాణించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. నిజానికి ఇప్పటికే ఆమె ‘కలివాణం’ అనే తెలుగు సినిమాలో నటించినప్పటికీ, అది వచ్చిన విషయమే చాలా మందికి తెలియదు. దీంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా కథలు వింటూ వచ్చింది. అయితే, ఇటీవల నాగదుర్గకు తమిళ ఇండస్ట్రీలో ఒక మంచి అవకాశం దక్కింది. పవీష్ నారాయణన్ హీరోగా నటిస్తున్న ‘లవ్ ఓ లవ్’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. మహేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్‌గా విడుదలై, ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.
తమిళంలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ సమయంలో, తాజాగా నాగదుర్గకు టాలీవుడ్‌లో ఒక భారీ బంపర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం. తెలంగాణ నేపథ్యంలో సాగే ఒక సరికొత్త వైవిధ్యమైన కథలో యంగ్ హీరో ప్రియదర్శి నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్‌గా నాగదుర్గను ఎంపిక చేసినట్లు నెట్టింట గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ విన్న నాగదుర్గకు క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఆమె వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. వంశీ దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార, నిర్మాత బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జూన్ 25న జరగబోతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూలై నుండి ప్రారంభం కానుందని టాక్. ఈ సినిమా కనుక హిట్ అయితే నాగదుర్గ కెరీర్ టాలీవుడ్‌లో ఓ రేంజ్‌కు వెళ్లడం ఖాయం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






