- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణపై జనసేన ఫోకస్.. మణికొండలో నూతన కార్యాలయం ప్రారంభం
తెలంగాణపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీ విస్తరణ కోసం పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మణికొండలో నూతనంగా నిర్మించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీ విస్తరణ కోసం పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మణికొండలో నూతనంగా నిర్మించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణం కోసం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తానే ప్రత్యేకంగా తిరుగుతానని కూడా చెప్పారు. అయితే గతంలో పవన్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వ్యతిరేఖత నెలకొంది. తెలంగాణ వాదులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నాయకుల దిష్ఠి తగిలింది అని పవన్ చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పవన్ కల్యాణ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో పవన్ మణికొండలో కొత్త కార్యాలయం ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వవన్ ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.






