- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంకుషాపూర్‌లో తెగిపడ్డ విద్యుత్ వైర్.. భయాందోళనలో ప్రజలు
గాలివాన బీభత్సానికి ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అంకుషాపూర్‌లో విద్యుత్ వైరు తెగిపడి 24 గంటలైనా విద్యుత్ సిబ్బంది స్పందించకపోవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

X
దిశ, ఘట్కేసర్: గాలివాన బీభత్సానికి ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అంకుషాపూర్‌లో విద్యుత్ వైరు తెగిపడి 24 గంటలైనా విద్యుత్ సిబ్బంది స్పందించకపోవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంట పొలాల మీదుగా శివాలయానికి వెళ్ళే మార్గంలో విద్యుత్ వైరు తెగిపడి ఉంది. లైన్ మెన్లకు రెండు సార్లు ఫోన్ చేసి సమాచారం అందించినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. ఇదే ప్రాంతంలో పశువులు, రైతు కూలీలు తిరుగుతుంటారని, ప్రాణ నష్టం జరగకముందే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలనని ప్రజలు కోరుతున్నారు.
Next Story






