- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి తప్పుడు వార్తలను నమ్మకండి.. జాగ్రత్తగా ఉండాలంటూ ‘రాపో23’ మేకర్స్ హెచ్చరిక
రాపో-23 సినిమాకు సంబంధించి కొన్ని అనధికారిక, ఫేక్ కాస్టింగ్ కాల్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.

దిశ, సినిమా: ఇన్నాళ్లు తన అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో మ్యాజిక్ క్రియేట్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు మెగా ఫోన్ పట్టనున్నారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘రాపో-23’. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కూడా విడుదలై అంచనాలను పెంచింది. ఇందులో ఆయన వీర అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇది ఎవరూ ఊహించని విధంగా ఒక ఉత్కంఠభరితమైన, సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు టాక్. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. ఈ చిత్రాన్ని రామ్ సినిమాటిక్స్ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను కూడా ప్రారంభించగా.. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలంటూ సోషల్ మీడియాలో కొన్ని కాస్టింగ్ కాల్ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ తాజాగా స్పందిస్తూ ప్రేక్షకులకు, అభిమానులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. "రాపో-23 సినిమాకు సంబంధించి కొన్ని అనధికారిక, ఫేక్ కాస్టింగ్ కాల్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దయచేసి ఎవరూ వాటిని నమ్మి మోసపోకండి. సినిమా టీమ్‌కు చెందిన వాళ్లమని చెప్పుకునే ఎవరికీ మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు. మా చిత్రానికి సంబంధించిన ఎలాంటి అధికారిక కాస్టింగ్ కాల్స్ లేదా అప్‌డేట్స్ అయినా సరే.. కేవలం మా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ప్రకటిస్తాము" అని మేకర్స్ హెచ్చరించారు. ఈ ప్రకటనతో పుకార్లకు చెక్ పడినట్లయింది. దీంతో అది చూసిన రామ్ అభిమానులు అప్రమత్తమవుతున్నారు.






