కీలక పరిణామం.. సాయికృష్ణ కుటుంబసభ్యులకు పోలీస్ విచారణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 08:37:22  IST  )

గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యువకుడి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు విజయవాడలోని కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లారు. ....

కీలక పరిణామం.. సాయికృష్ణ కుటుంబసభ్యులకు పోలీస్ విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యువకుడి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు విజయవాడలోని కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లారు. సాయికృష్ణ తల్లితో పాటు ఇతర కుటుంబసభ్యులను వివరాలు అడిగితెలుసుకున్నారు.

మార్కాపురంలో సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నుంచి ఏం జరిగిందనే విషయాలపై ఆరా తీశారు. ఆ తర్వాత సాయికృష్ణ ఇంటికి ఎన్ని సార్లు ఫోర్లు చేశారు. ఎవరెవరితో ఏం మాట్లాడారు అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ అయినట్లు తమకు ఎలా తెలిసింది. ఎవరు చెప్పారనే కోణంలోనూ ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీఐ నాగరాజుకు, తమకు మధ్య ఏం జరిగిందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

కాగా ఈ కేసులో సీఐ నాగరాజుపై సాయికృష్ణ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు లొంగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు మిస్టరీగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story