‘వారణాసి’పై జీ కన్ను.. అన్ని హక్కుల కోసం చర్చలు

by Pulgam srinivas |

'వారణాసి' చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులను సొంతం చేసుకునేందుకు జీ సంస్థ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

‘వారణాసి’పై జీ కన్ను.. అన్ని హక్కుల కోసం చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో 'వారణాసి' ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కథానాయికగా కనిపించనుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీకి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ తదితర హక్కులను సొంతం చేసుకునేందుకు జీ సంస్థ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీ మొత్తాన్ని నిర్మాతలకు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి జీ సంస్థ ఆఫర్‌కు చిత్ర బృందం అంగీకరిస్తుందా? లేదా మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story