- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ సమీక్షలో ప్రోటోకాల్ ఉల్లంఘన..
కాగజ్ నగర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, అధికారిక సమీక్షా సమావేశం వివాదాస్పదంగా మారింది.

దిశ,కాగజ్ నగర్: కాగజ్ నగర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, అధికారిక సమీక్షా సమావేశం వివాదాస్పదంగా మారింది. కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో శుక్రవారం పారిశుధ్య నిర్వహణ, మున్సిపల్ పన్నుల వసూళ్ల ప్రగతిపై సమీక్షించేందుకు అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా విచ్చేశారు. మున్సిపల్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు, వార్డు కౌన్సిలర్లతో ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సీట్లలో చేరిన అనధికార వ్యక్తులు..
కేవలం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే పరిమితం కావలసిన ఈ సమావేశంలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు మాజీ మున్సిపల్ నాయకులు ప్రవేశించారు. సమీక్షతో ఎటువంటి అధికారిక సంబంధం లేని వీరు, ఏకంగా వివిధ విభాగాల అధికారులు కూర్చోవాల్సిన కుర్చీలోనే ఆసీనులయ్యారు. ఐఏఎస్ అధికారి స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో.. పక్కనే అనధికార వ్యక్తులు వచ్చి కూర్చోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సతుల స్థానంలో పతులు..
సమావేశంలో మరో ప్రధానాంశం ఏమిటంటే, నిబంధనల ప్రకారం మహిళా వార్డు కౌన్సిలర్లు హాజరుకావాల్సిన చోట, వారి భర్తలు (కౌన్సిలర్ల పతులు) వచ్చి అధికారుల పక్కన చేరి. అధికారిక విధుల్లో మహిళా కౌన్సిలర్ల కంటే వారి కుటుంబ సభ్యుల జోక్యమే ఎక్కువగా ఉందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి పాల్గొనే కీలకమైన ప్రభుత్వ సమీక్షా సమావేశంలో కనీస ప్రోటోకాల్ పాటించకపోవడం, అనధికార వ్యక్తులను అధికారుల స్థానాల్లో కూర్చోనివ్వడం, దీనికి మున్సిపల్ అధికారులు వత్తాసు పలకడంతో, ఇకనైనా ఇటువంటి అధికారిక సమావేశాల్లో మున్సిపల్ అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






