రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

by Batti.Sumithra |

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం తండా శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, పెద్దవూర : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం తండా శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కొంకవారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల తంసయ్య (59) తన చిన్న కుమారుడు కాకర్ల ప్రకాష్‌రావు (35)తో కలిసి గురువారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ఎరకల ప్రవీణ్కు చెందిన కారును అద్దెకు తీసుకుని నాగార్జునసాగర్‌లోని సాగర్‌మాత ఆలయానికి బయలుదేరారు. వారు పెద్దవూర మీదుగా నాగార్జునసాగర్ వైపు వెళ్తుండగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో రామన్నగూడెం తండా శివారులో ఎదురుగా వస్తున్న మారుతి సుజుకి కారు డ్రైవర్ గొర్రె రామకృష్ణ అతివేగంగా, నిర్లక్ష్యంగా, రాంగ్‌రూట్‌లో నడపడంతో ఎదురెదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కాకర్ల తంసయ్య, ఆయన కుమారుడు ప్రకాష్‌రావు అక్కడికక్కడే మృతి చెందారు.

అలాగే కారులో ప్రయాణిస్తున్న రావుల సాయికుమార్, అచ్చంపేట (హనుమకొండ) నివాసి, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి వచ్చిన కారును నడుపుతున్న ఎరకల ప్రవీణ్, అలాగే కారులోని మరో ప్రయాణికుడు కొర్ర సాయి గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కూడా అదే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై మృతుడు తంసయ్య పెద్ద కుమారుడు కాకర్ల అంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దవూర ఎస్‌ఐ జె.గోపాల్‌రావు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆది రెడ్డి, నాగార్జునసాగర్ సీఐ బి. శ్రీను నాయక్, పెద్దవూర ఎస్‌ఐ జె.గోపాల్‌రావు, నాగార్జునసాగర్ ఎస్‌ఐ సతీష్ సందర్శించి ప్రమాదానికి గల కారణాల పై విచారణ చేపట్టారు.

Next Story