రాజశేఖర్ రెడ్డికి కీలక బాధ్యతలు.. జిల్లా కన్వీనర్‌గా నియామకం

by Batti.Sumithra |

గుడిపల్లి గ్రామసర్పంచ్‌గా సుమారు 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన కూన్‌రెడ్డి రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ పంచాయతీరాజ్ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి నల్గొండ జిల్లా సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్‌గా నియమించారు.

రాజశేఖర్ రెడ్డికి కీలక బాధ్యతలు.. జిల్లా కన్వీనర్‌గా నియామకం
X

దిశ, కొండమల్లేపల్లి : ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున గుడిపల్లి గ్రామసర్పంచ్‌గా సుమారు 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన కూన్‌రెడ్డి రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ పంచాయతీరాజ్ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి నల్గొండ జిల్లా సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్‌గా నియమించారు. తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం సర్వసభ్య సమావేశంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి నల్గొండ జిల్లా సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన పై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ, సర్పంచ్‌ల ఐక్యతకు తోడ్పాటునందిస్తానని ఆయన తెలిపారు.

Next Story