- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా
వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతుందని, అయినప్పటికీ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందిస్తామని సింగరేణి చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి పేర్కొన్నారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి: వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతుందని, అయినప్పటికీ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందిస్తామని సింగరేణి చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం తెలంగాణ జెన్ కో ఛైర్మన్ డాక్టర్ హరీష్ సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతిని కలిశారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాపై చర్చించారు. వర్షాకాలంలో యాదాద్రి సహా అన్ని థర్మల్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలగకుండా నాణ్యమైన బొగ్గును తగినంతగా సరఫరాపై చర్చించారు. దీనిపై సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి స్పందిస్తూ.. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో దాదాపు 93 శాతం బొగ్గు ఓపెన్ కాస్ట్ గనుల నుంచే వస్తుందని, భారీ వర్షాలు కురిసినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వర్ష ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అన్ని ఓపెన్ కాస్ట్ గనులలో అనేక ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉన్న బొగ్గు పరిమాణం గురించి స్టాక్ గురించి కూలంకషంగా చర్చించారు. సింగరేణి సంస్థ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏడాదికి దాదాపు 28 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేస్తుంది. రోజుకు 60 నుంచి 70 వేల టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్లు వివరించారు. తెలంగాణ విద్యుత్ అవసరాలకు విఘాతం కలగకుండా చూడాలని సీఎండీ స్పష్టం చేశారు. బొగ్గు నాణ్యత విషయంలోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్ వి. సూర్యనారాయణ(ఆపరేషన్స్), డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, తెలంగాణ జెన్ కో ఈడీ నగ్యా, డైరెక్టర్ రాజశేఖర్, సీఈ లక్ష్మయ్య తదితరులుఅధికారులు పాల్గొన్నారు.






