పేకాట స్థావరంపై పోలీసుల దాడి

by velandi.Saikiran |

తొర్రూర్ పట్టణంలోని విశ్వ గ్రాండ్ లాడ్జ్‌లో నిషేధిత పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి నిర్వహించారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ, తొర్రూర్ : తొర్రూర్ పట్టణంలోని విశ్వ గ్రాండ్ లాడ్జ్‌లో నిషేధిత పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి నిర్వహించారు. సాయంత్రం 7 గంటల సమయంలో నిర్వహించిన తనిఖీల్లో లాడ్జ్‌లో ఎనిమిది మంది వ్యక్తులు మూడు ముక్కలాట (పేకాట) ఆడుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఐదు మోటార్ సైకిళ్లు, నగదు రూ.2,520 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తొర్రూర్ ఎస్సై తెలిపారు. నిషేధిత జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Next Story