- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుట్కా పొగాకు ఉత్పత్తుల అమ్మకాల పై పోలీసుల తనిఖీలు
సైదాపూర్ మండలంలోని విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

దిశ, సైదాపూర్: సైదాపూర్ మండలంలోని విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యాసంస్థల 100 మీటర్ల పరిధిలో విక్రయాలు చట్టవిరుద్ధమని వ్యాపారులను ఈ సందర్భంగా హెచ్చరించారు సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం 2003లోని సెక్షన్ 6 ప్రకారం పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి విక్రయాలు జరిపే దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల సమీపంలో గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే స్థానిక పోలీసు స్టేషన్ లేదా గ్రామ పంచాయితీలో ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.






