ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్‌పై వస్తున్న వార్తలను ప్రభుత్వం వెంటనే ఖండించాలి

by Batti.Sumithra |

ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేస్తున్నారనే వార్తలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించాలని రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు.

ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్‌పై వస్తున్న వార్తలను ప్రభుత్వం వెంటనే ఖండించాలి
X

దిశ, నల్లగొండ టౌన్ : ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేస్తున్నారనే వార్తలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించాలని రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలో జిల్లా అధ్యక్షుడు జోగు నాగేష్ ఆధ్వర్యంలో ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న హలో ఉపసర్పంచ్.. చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు పై వస్తున్న వార్తలను వెంటనే ఖండించాలని కోరారు.

అలాగే వార్డు సభ్యులకు నెలకు రూ.3,000, ఉపసర్పంచ్‌లకు రూ.5,000 గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నెల 25న జరిగే భారీ ధర్నాలో రాష్ట్రంలోని ఉపసర్పంచ్‌లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మజ్జిగ నరేష్, మట్టా శ్రీనివాస్, కట్టంగూరు మండల అధ్యక్షుడు గోపగాని లింగమ్మ జానయ్య, అయితగోని వెంకటేశం, సతీష్, నవ్య అనిల్ కుమార్ గౌడ్, కడారి కొండల్, నక్క రాజేష్, మర్రి శివ తదితరులు పాల్గొన్నారు.

Next Story