ఈ నెల 23న అశ్వారావుపేటకు హరీష్ రావు రాక

by Taduka Kalyani |

ఈనెల 23న మాజీ మంత్రి హరీష్ రావు అశ్వారావుపేట రానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ తెలిపారు.

ఈ నెల 23న అశ్వారావుపేటకు హరీష్ రావు రాక
X

దిశ, అశ్వారావుపేట: ఈనెల 23న మాజీ మంత్రి హరీష్ రావు అశ్వారావుపేట రానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ లో ఐదు మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నాయకులతో పార్టీ సభ్యత్వ నమోదుకు తీసుకోవాల్సిన చర్యలపై సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పల వెంకట రమణ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప్పల వెంకట రమణ మాట్లాడారు.. అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీనీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ నెల 23న అశ్వారావుపేటలో సర్ ఓటర్ నమోదు మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నిర్వహించనున్న అవగాహన సదస్సుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకానున్నారు. సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు రాజకీయాలపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారని తెలిపారు.

ముగ్గురు మంత్రులు దృష్టి సంపాదన పైనే

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీపడి ప్రజాసేవ చేస్తారనుకుంటే.. సంపాదించడంలో పోటీ పడుతున్నారని ఉప్పల వెంకటరమణా విమర్శించారు. 1/70 చట్టానికి విరుద్ధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాల లో మంత్రి తుమ్మల ప్రమేయం పై తాను అడిగిన ప్రశ్నలకు తుమ్మల ఎందుకు సమాధానమివ్వడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ అయినా వారికే దక్కుతోందని, కాంట్రాక్టులపై వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాకు దిగడం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉందన్నారు. పర్సంటేజీల కమీషన్ల వ్యవహారంలో కాంట్రాక్టర్లంతా ఏకమై సెక్రటేరియట్ వద్ద వ్యతిరేకంగా ధర్నా చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగలేదని దుయ్యబట్టారు.

Next Story